మనమంతా, ఎందుకు?


ఒక పువ్వు రాలుతుంది. ఒక పదేళ్ళ పాప చెయ్యిచాచి ఆనందంగా ఆ పువ్వును పట్టుకుంటుంది. ఇది మనమంతా సినిమా లో మొట్టమఒదటి దృశ్యం. మహిత అన్న ఆ పాప, ముందుముందు ఒక నాలుగేళ్ళ బాబు జీవితం రాలిపోతుంటే పట్టుకుంటానికి విశ్వప్రయత్నం చేస్తుంది.

మోహన్ లాల్ చేసిన సాయిరామ్ పాత్ర పంక్చరైన మోటర్ సైకిల్ తోస్తూ పరిచయమౌతుంది. ఆ పేచీలేసే అతను ఇక్కడ పంక్చర్ల మధ్యన ట్యూబు వెతకాలంటాడు. సాయిరామ్ వ్యక్తిత్వం కూడా అంతే; చిల్లు లేని సాఫీ ట్యూబు లా మొదలై, తనకు తెలియకుండానే జీవితం లో పైకిరావడానికి చిన్న చిన్న అడ్డ దారుల ప్రయాణం లో తన అసలు నైజం ఆపధర్మ పేచీల క్రింద కప్పడి పోతుంది. కరప్షన్ గవర్నమెంటు ఆఫీసుల కే పరిమితం కాదు; ప్రతి మనిషి దైనందిక జీవితం లోకీ మెల్లగా చోటుచేసుకుంటుంది. ఒకేసారి పేలుతుంది. అప్పుడు, ఇన్ స్టాల్మెంట్ లో చేసిన చిరు తప్పులకి మొత్తం వడ్డీ తో సహా సింగిల్ పేమెంట్ చెయ్యగలమా? అలాంటి భయంకరమైన పరిస్థితి లో చిక్కుకుంటాడు సాయిరామ్.

ఒక వైట్ బోర్డ్ పైన మనకి అర్ధం కాని ఈక్వేషన్, దాని ముందు క్లాస్ లో అభిరామ్ (విశ్వాంత్) పరిచయమవుతాడు. ఎంత కాంప్లికేటిడ్ కోడ్ లోని లోపాన్నైనా సునాయాసంగ పరిశ్కరించగలిగే ఐ టీ స్టూడెంట్ తను. కాని, ప్రేమ ఇరువైపుల కలగాలనే అతి సింపిల్ సూత్రాన్ని కాంప్లికేట్ చేసుకుని చివరికి ప్రాణం మీదకే తెచ్చుకుంటాడు.

గౌతమి కేరెక్టర్, గాయత్రి, వంటింట్లో పరిచయమౌతుంది. ప్రెషర్ కుకర్ పక్కన. చాలీచాలని రాబడితో పిల్లలలకు ఏదీ తక్కువవ్వకుండా చూసుకునే ప్రెషర్ అనుదినం భరిస్తుంది. ఆ ప్రెషర్ కొన్ని క్షణాలు ఈల లా రిలీస్ చేసే సరదా ఫ్రెండ్ గా ఊర్వశి పరిచయమవుతుంది.

అందరూ తమ కష్టాలనుండి ఆదుకొనే అవకాశాల కోసం ఎదురుచూస్తారు, అవకాశం తలుపుతట్టడమే కాదు ఎలుగెత్తి పిలుస్తున్నా తప్పించుకు పోయే జంకు నేర్పింది జీవితం, గాయత్రికి. ఐనా అవకాశం మళ్ళీ వరమిస్తుంది, ఒక అనూహ్యమైన, అద్భుతమైన క్లైమేక్స్ కి దారితీస్తుంది. కాని, అవకాశానికందకుండా పారిపోవటం వల్ల కూడ ప్రయోజనమే. ఒక బేగ్ నీటిలో పడిపోయి, ఇంకో కద్ధ ముగింపుని తేల్చే తెప్ప అవుతుంది. ఇలా నెమరువేసుకోవటానికి, అనుభవించడానికి ఎన్నో ఈ సినిమాలో. ఆ చిన్న పాప చెయ్యిచాపి పువ్వు అందుకున్నట్టు మనం ఈ సినిమా ని అందుకోవాలి. లేకపోతే ఒక అపురూప మైన అనుభవం చే జారిపోతుంది.

మహిత, సాయిరామ్, గాయత్రి, అభిరామ్ — ఈ నలుగురు కద్ధ, మనమంతా. ఇంచుమించు మనందరి కద్ధ. చివరికి — ఇంటి బజెట్ల మధ్య, సరుకుల ధరల మధ్య, ఆఫీస్ పాలిటిక్స్ మధ్య — చిరునవ్వు విలువ తెలిపే కద్ధ ఇది. మనమంతా అందుకే.

2 thoughts on “మనమంతా, ఎందుకు?

  1. what a movie it is .. Awesome.. !! Great work sir. The modern cinema is running after the most unrealistic concepts of life but your cinema is very close to the realities of life and can be a grain of food to change the perception towards improving human values within people. Thank you.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s