రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచుం ఎక్కువగా. టీ వీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కేరొలీన మారిన్ ని పైకి లేపి హత్తుకుంది.ఇది సహ అనుభూతి; ఇది తన పైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ సింధు ని కౌగిలించుకొని ఆ విజయోత్సాహం లో తన కోచ్ ల వద్దకు వెళ్ళిపోయింది. తన రేకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సిందు ఆ రేకట్ తీసి, మారిన్ కిట్ బేగ్ దగ్గర పెట్టి అప్పుడు తన గురువు దగ్గరకు వెళ్ళింది. ఇది సంస్కారం. ఇదీ బంగారం. తల్లి తండ్రుల పెంపకం, గురువుల శిక్షణ తో వచ్చేది; గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, ఏ రష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది ప్రపంచం లో. అది మలచిన రమణ విజయలక్ష్మిలకు, గురువు గోపిచంద్ కు నమస్కరిద్దాం.
మన సింధు మన బంగారం. నేను బాడ్మింటన్ పెద్దగా పట్టించుకోను. కానీ మన తెలుగు సింధు కోసంగా చూసా. బంగారు పతకం రక పోయినా బంగారం లాంటి పోరాట పటిమ చూపింది. మమ్మల్ని నీ ఆటతో గర్వపడేలా చేసినందుకు కోటి ధన్యవాదాలు.
అవును సర్. నిత్యం అనేక ఇబ్బందికర మనుషుల్ని, పరిస్థితుల్ని చూస్తుంటాం. అలాంటప్పుడే అనిపిస్తుంది సంస్కారాన్ని మించినది ఏదీ లేదని.
సార్, 2007 లో అమృతం సీరియల్‌కు రచయితలు కావాలని స్వాతిలో మీరు ప్రకటన ఇచ్చారు. నేను మీకు మెయిల్ చేస్తే, పిలిచి మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఎందుకో పనిచేసే అవకాశం రాలేదు. But still I cherish the moment.
సంస్కారం అనేది భారతీయం. ఈ విషయాన్ని వెండి గెల్చుకున్న బంగారం అంటూ ఎంతో బాగా చెప్పారు. ధన్యవాదాలు.
Nice
మీ కామెంట్స్ చాలా గొప్పగా ఉన్నాయి సర్
నేను గమనించింది మీరు గమనించారు అది సంస్కార వంతుల లక్షణం ..సింధు ఆట కి సంస్కారానికి భారతీయులకే గొప్ప గౌరవము తీసుకు వచ్చింది ..జైహో సింధు