2001 లో హనుమంత రావు గారు ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోసారు.
అంజి గా ఖచ్చితంగా ఆయనే బాగుంటాడని చందు (యేలేటి) చెప్పాడు. నేను ఊహించలేదు అప్పుడు, అది ఎంత గొప్ప ఎంపికో! గుండు హనుమంత రావు గారు అంజి గా చేసిన తీరు మా అందరికీ మరింత ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది — వారం వారం ఒక కొత్త కథ వ్రాయటానికి. ఆ ఇంధనం మమ్మల్ని మూడు వందల వారాలు నడిపింది.
కొన్ని నికృష్టమైన కారణాల వల్ల అమృత రావు పాత్ర లేకుండా ఎపిసోడ్లు చెయ్యాల్సివచ్చింది. ఆ సమయం లో మూడు నెలలు అంజి పాత్రే సీరియల్ ని మోసింది.
పేరు అమృతమైనా కధ అంజి గురించే — ఆంజనేలు వేసే పథకాలు, చేసే ప్రయోగాలు, పడే ప్రయాసలు. ఎన్ని సార్లు క్రింద పడ్డా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూనే వుండేవాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ నిచ్చెనెక్కి ఆకాశం లొకి వెళ్ళిపోయాడు. అంజి అమృతం తాగకపోయినా, అందించిన అమరుడు.
Daily 6pm ki ETV plus lo chusthunam..enni sarlu telecast chesina chustham…stress,work tensions nunchi bayata padataniki Amrutham serial chusthe saripothundhi Sir…Late ayina malli new season start chestharemo anukunnam..But meeru cheppinattu Anji paatra ki Gundu HanumanthaRao gaaru maatrame saripotharu..vere evvaru chesina suit avvaru.. RIP..
మీరన్నది నిజం. అంజి అమరుడు. అమృతం అందించిన అమరుడు.
Anji “Amruthudu”. Ennatiki sanjeevudu. Anji leni Amrutham ledu, Amrutham kaani Anji ledu.
hanumantha rao gari gurunchi chala baaga vrasaaru sir.main meddia lo evaru intha goppaga vrayaledu sir. mukhyanga ఎన్ని సార్లు క్రింద పడ్డా ఆకాశానికి నిచ్చెనలు వేస్తూనే వుండేవాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ నిచ్చెనెక్కి ఆకాశం లొకి వెళ్ళిపోయాడు. అంజి అమృతం తాగకపోయినా, అందించిన అమరుడు. genuine appreciation comes from genuine and honest persons ane vishayamu ikkada artham avuthundi sir. idi chala super.meelanti english lo screenplay vrasu konevaru kuda telugu lo intha goppaga crispy ga vrayadam chala goppaga vundi sir