కాదు, కారాదు. తల్లి తండ్రులు ఈ ఒక్క వాక్యం పదే పదే వల్లించుకుని వాళ్ళ పిల్లల తో ఒక్కసారి చెప్పగలిగితే కొన్ని వేల గుండెపోట్లు తప్పుతాయి.
విజయానికి మెట్లు, ఎవరో గీసిన గీట్ల మధ్యనో, పుస్తకాల పుటల్లోనో వుంటాయా? నీ సంతోషానికి నిర్వచనం ఎదరింటి వాడి వైఖరి లో కనబడుతుందా? నీ ఎద లోనే దాగి వుందా? వేణు ఊడుగుల కొన్ని సూటి ప్రశ్నలు వేసాడు, ఘాటుగా వేసాడు. జవాబులు ప్రతి తల్లీ, తండ్రీ నిస్సంకోచంగా వెతుక్కోవాలి, ధైర్యంగా ఆ బాటలో నడవాలి. దైనందిక జీవితంలో ఆలోచించటానికి సమయం లేక మనం గొర్రెల్లు గా మారిపోయాము. భయం ఊలు కప్పుకున్న గొర్రెలు. విచారకరం ఏమిటంటే, ఏ పులి నో సింహాన్నో చూసి భయపడటం లేదు, వేరే గొర్రెల్ని చూసి భయపడుతున్నాము. ఈ కథ పిల్లలకు కొంత ఊరటను, పెద్దలకు కొంత సాహసాన్ని ఇవ్వాలి. ఇది అందించిన టీమ్ కి తేంక్స్.
ఈ సినిమా చూసిన వాళ్ళంతా, “నీదీ నాదీ ఒకటే మాట — చాలా బాగుంది” అంటారని నమ్ముతున్నాను.
Ganga raju garu, I thoroughly enjoyed the movie. We should congratulate the director and his team for their bold endeavor. It isn’t an easy subject. what stands out more than anything else, is the authenticity of the performers, and the refreshingly candid screenplay. Great effort. The team should take a bow.