సింధు — వెండి గెలుచుకున్న బంగారం


రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచుం ఎక్కువగా. టీ వీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కేరొలీన మారిన్ ని పైకి లేపి హత్తుకుంది.ఇది సహ అనుభూతి; ఇది తన … Continue reading సింధు — వెండి గెలుచుకున్న బంగారం

మనమంతా, ఎందుకు?


ఒక పువ్వు రాలుతుంది. ఒక పదేళ్ళ పాప చెయ్యిచాచి ఆనందంగా ఆ పువ్వును పట్టుకుంటుంది. ఇది మనమంతా సినిమా లో మొట్టమఒదటి దృశ్యం. మహిత అన్న ఆ పాప, ముందుముందు ఒక నాలుగేళ్ళ బాబు జీవితం రాలిపోతుంటే పట్టుకుంటానికి విశ్వప్రయత్నం చేస్తుంది. మోహన్ లాల్ చేసిన సాయిరామ్ పాత్ర పంక్చరైన మోటర్ సైకిల్ తోస్తూ పరిచయమౌతుంది. ఆ పేచీలేసే అతను ఇక్కడ పంక్చర్ల మధ్యన ట్యూబు వెతకాలంటాడు. సాయిరామ్ వ్యక్తిత్వం కూడా అంతే; చిల్లు లేని సాఫీ … Continue reading మనమంతా, ఎందుకు?