అమృతం ద్వితీయం పాట


ఫిబ్రవరి 2001 లో మొదలైంది, అమృతం పాట కాగితం మీద పెట్టే పని. ఎన్ని సార్లు ఎన్ని ఆలోచనలు, అమరికలు రాసి-కొట్టేసి-రాసిందో సీతారామ శాస్త్రి కలం. అరేబిఅయా బావి లో చమురు లాగ ఆ కలం లో సిరా బోలుడంత, కాని సంతృప్తి ఎడారి లో నీటి బొట్టంత. ఎలాగైతే, అక్టోబర్ చివర్లో ఆ కర్కస కలానికి కనికరం, తృప్తి కలిగాయి. కాని చదవటానికి నేను ఊళ్ళో లేను. సీతారామ శాస్త్రి కి ఉత్సాహం ఆగలేదు. హిమాచల్ … Continue reading అమృతం ద్వితీయం పాట

అమృతం మళ్ళీ చిలుకుతున్నాం


అమృతం మళ్ళీ చిలుకుతున్నాం ఇన్నాళ్ళెందుకు పట్టింది? 'అమృతం' మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు: అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). ఇవ న్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అందరూ కలిసి వచ్చారు; మనందరికీ దూరమైపోయిన గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు తప్ప. అది తీరని లోటే. ఐనా సాహసించి, వారి జ్ఞాపకాలతో, మీ అందరి ఆదరణ తో … Continue reading అమృతం మళ్ళీ చిలుకుతున్నాం

గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో


2001 లో హనుమంత రావు గారు ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోసారు. అంజి గా ఖచ్చితంగా ఆయనే బాగుంటాడని చందు (యేలేటి) చెప్పాడు. నేను ఊహించలేదు అప్పుడు, అది ఎంత గొప్ప ఎంపికో! గుండు హనుమంత రావు గారు అంజి గా చేసిన తీరు మా అందరికీ మరింత ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది -- వారం వారం ఒక కొత్త కథ వ్రాయటానికి. ఆ ఇంధనం మమ్మల్ని మూడు వందల వారాలు నడిపింది. కొన్ని నికృష్టమైన … Continue reading గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో

సింధు — వెండి గెలుచుకున్న బంగారం


రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచుం ఎక్కువగా. టీ వీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కేరొలీన మారిన్ ని పైకి లేపి హత్తుకుంది.ఇది సహ అనుభూతి; ఇది తన … Continue reading సింధు — వెండి గెలుచుకున్న బంగారం

King Virat


Virat Kohli is just a normal being. But he has five Pandavas working for him incognito. Incomparable Valour, Overwhelming Strength, Uncompromising Values, Captivating Aesthetics, and Uncommon intelligence. No wonder his T 20 average is a double five. No other cricketer is even in the 40’s. Yet he just plays cricket, not bat and body gymnastics … Continue reading King Virat

డభై ఎనిమిదేళ్ళ కుర్రాడికి నివాళి


ఒక యుగం ముగిసింది. నిర్మాతే సినిమా కి మూలవిరాట్టైన యుగం. దానికి యుగపురుషుడు రామానాయుడు గారు. ఎందుకంటే ఆయన ఆత్మబలం, ఉత్సాహం, అసమానం. కొన్ని దశాబ్దాల క్రితం డి వి నరసరాజు గారు ఒక కొత్త పంధా కద్ధ తయారు చేసారు, హీరో కి డ్యుఅల్ రోల్ తో. చాలా మంది నిర్మాతలు చాలా బాగుందన్నారు. కాని సినిమా తీయటానికి జంకారు. మూడు నాలుగేళ్ళు అలాగే పడివుంది, పూర్తిగా రెడీ ఐన ఆ స్క్రిప్టు. అప్పుడే ఒక … Continue reading డభై ఎనిమిదేళ్ళ కుర్రాడికి నివాళి