అమృతం ద్వితీయం పాట


ఫిబ్రవరి 2001 లో మొదలైంది, అమృతం పాట కాగితం మీద పెట్టే పని. ఎన్ని సార్లు ఎన్ని ఆలోచనలు, అమరికలు రాసి-కొట్టేసి-రాసిందో సీతారామ శాస్త్రి కలం. అరేబిఅయా బావి లో చమురు లాగ ఆ కలం లో సిరా బోలుడంత, కాని సంతృప్తి ఎడారి లో నీటి బొట్టంత. ఎలాగైతే, అక్టోబర్ చివర్లో ఆ కర్కస కలానికి కనికరం, తృప్తి కలిగాయి. కాని చదవటానికి నేను ఊళ్ళో లేను. సీతారామ శాస్త్రి కి ఉత్సాహం ఆగలేదు. హిమాచల్ … Continue reading అమృతం ద్వితీయం పాట

అమృతం మళ్ళీ చిలుకుతున్నాం


అమృతం మళ్ళీ చిలుకుతున్నాం ఇన్నాళ్ళెందుకు పట్టింది? 'అమృతం' మళ్ళీ వార్చటానికి? పలు కారణాలు: అలసట, ఆలోచనలు అడుగంటటం, అనుమానం (మునుపటిలా ప్రేక్షకులని మెప్పించగలమా). ఇవ న్నీ అధిగమించినా, ఆచరణలొ పెట్టడానికి అవసరమైన, లేని, పెట్టుబడి కొండంత కనిపించింది. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి అన్నీ సమకూరాయి, అందరూ కలిసి వచ్చారు; మనందరికీ దూరమైపోయిన గుండు హనుమంత రావు గారు, దేవదాసు కనకాల గారు తప్ప. అది తీరని లోటే. ఐనా సాహసించి, వారి జ్ఞాపకాలతో, మీ అందరి ఆదరణ తో … Continue reading అమృతం మళ్ళీ చిలుకుతున్నాం