కంచరపాలెం, కేర్ ఆఫ్ మహా మహిమ


ఈ స్వచ్చమైన తెలుగు మట్టి లొని మాణిక్యం గురించి ఎంతైనా చెప్పొచ్చు. కాని ఏమి రాసినా చూడబోయే వాళ్ళ అనుభవం, ఆనందం, ఆశ్చర్యం పాడుచేసినట్టవుతుంది. కొన్నేళ్ళ క్రితం, 'అ వెన్స్ డే' హిందీ సినిమా చూసినప్పుడు అనిపించింది, 'ఆహా, ఇలాంటి ఐడియా నాకు తట్టుంటే గాలి లో తేలేవాడిని' అని. ఇన్నాళ్ళకు, ఈ సినిమా చూసాకా మళ్ళీ అలా అనిపించింది. ఈ ఆణి ముత్యాన్ని అందించి, గుండెనుప్పొంగించిన అందరికీ నా ధన్యవాదాలు.