సహ అనుభూతి — మహానుభూతి


‘మహానటి’. ‘ఓ సీత కథ నుంచి ఒకే వొక సావిత్రి కథ వరకు కూర్చిన ‘వైజయంతి’మాల లో ఇది ఎప్పటికీ మెరిసే ఆణిముత్యం. ఇలాంటి అనుభూతి అపూర్వం. తెలుగు సినిమాకు తరతరాలు తరగని సంపద అందించిన ఎందరో దిగ్గజాల తో మూడు గంటలు సన్నిహితంగా గడిపాం. కె.వి. రెడ్డి, ఎల్.వి. ప్రసాద్, చక్రపాణి, బి.నాగి రెడ్డి, సింగీతం, పింగళి, ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్ — వీరి మధ్య అన్ని దిక్కులు మిరిమిట్లు గొలిచేలా వెలిగిన అపురూపమైన తార; సావిత్రి. … Continue reading సహ అనుభూతి — మహానుభూతి

నీదీ నాదీ ఒకే కథ — కాదు.


కాదు, కారాదు. తల్లి తండ్రులు  ఈ ఒక్క వాక్యం పదే పదే వల్లించుకుని వాళ్ళ పిల్లల తో ఒక్కసారి చెప్పగలిగితే కొన్ని వేల గుండెపోట్లు తప్పుతాయి. విజయానికి మెట్లు, ఎవరో గీసిన గీట్ల మధ్యనో, పుస్తకాల పుటల్లోనో వుంటాయా? నీ సంతోషానికి నిర్వచనం ఎదరింటి వాడి వైఖరి లో కనబడుతుందా? నీ ఎద లోనే దాగి వుందా? వేణు ఊడుగుల కొన్ని సూటి ప్రశ్నలు వేసాడు, ఘాటుగా వేసాడు. జవాబులు ప్రతి తల్లీ, తండ్రీ నిస్సంకోచంగా వెతుక్కోవాలి, ధైర్యంగా ఆ బాటలో … Continue reading నీదీ నాదీ ఒకే కథ — కాదు.

గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో


2001 లో హనుమంత రావు గారు ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోసారు. అంజి గా ఖచ్చితంగా ఆయనే బాగుంటాడని చందు (యేలేటి) చెప్పాడు. నేను ఊహించలేదు అప్పుడు, అది ఎంత గొప్ప ఎంపికో! గుండు హనుమంత రావు గారు అంజి గా చేసిన తీరు మా అందరికీ మరింత ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది -- వారం వారం ఒక కొత్త కథ వ్రాయటానికి. ఆ ఇంధనం మమ్మల్ని మూడు వందల వారాలు నడిపింది. కొన్ని నికృష్టమైన … Continue reading గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో

Notional Anthem


Today, two judges of the Supreme Court showed the greatest disrespect ever for the Indian National Anthem. And displayed the utmost contempt for the Indian citizen. They imputed that only imprisoning people will make them listen to the anthem. Brushing away individual rights, the bench  imperiously stated that there was no space for individual rights here. … Continue reading Notional Anthem