గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో


2001 లో హనుమంత రావు గారు ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోసారు. అంజి గా ఖచ్చితంగా ఆయనే బాగుంటాడని చందు (యేలేటి) చెప్పాడు. నేను ఊహించలేదు అప్పుడు, అది ఎంత గొప్ప ఎంపికో! గుండు హనుమంత రావు గారు అంజి గా చేసిన తీరు మా అందరికీ మరింత ఉత్సాహం ప్రేరణ ఇచ్చింది -- వారం వారం ఒక కొత్త కథ వ్రాయటానికి. ఆ ఇంధనం మమ్మల్ని మూడు వందల వారాలు నడిపింది. కొన్ని నికృష్టమైన … Continue reading గుండు — ఎప్పటికీ తెలుగు గుండెల్లో

చదివే అమృతం – ఎపిసోడ్ 1


అచ్చు అమృతం -1గో గృహప్రవేశం ఆ రోజెందుకో భళ్ళున తెల్లవారలేదు.... అది స్పెషల్ రోజైనా నింపాదిగా,నిశబ్ధంగానే మెల్ల వారింది. అలా జరిగినట్టు పక్కమీద గురక పెడుతున్న అంజికి గానీ, తన పక్కన బల్ల పైన పొర్లుతున్న గడియారానికి గానీ తెలియదు. అంజి పూర్తి పేరు ఆముదాల ఆంజనేయప్రసాద్. గడియారం పూర్తి పేరు అలారాల గడియారం. అంజి ప్రక్కన పడుకున్న శాంతమూర్తి అంజి నొక దెబ్బవేసింది, "ఏమండీ " అన్న బీట్ తొ. అంజి నిదట్లోనే "ఊ" కొట్టాడు. ఆమె … Continue reading చదివే అమృతం – ఎపిసోడ్ 1